హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ నిరసన: రాహుల్ గాంధీ హాజరుపై ఉత్కంఠ

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ప్రముఖ జాతీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.