రాజాపేటలో రావి నారాయణరెడ్డి 37వ వర్ధంతి ఘన నివాళి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణరెడ్డి 37వ వర్ధంతిని సోమవారం మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన సేవలను కొనియాడారు. గంధమల్ల రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.