కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తునకు ఏసీబీ కోర్టును ఆశ్రయించింది
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల మళ్లింపు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను జప్తు చేయాలని ఏసీబీ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు. నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణను వేగవంతం చేసిన ఏసీబీ, నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్ట్ కార్యాలయం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.