ఎన్నికలకు దూరంగా శ్రీకాకుళం పల్లె: దశాబ్దాలుగా ఏకగ్రీవ ఆనవాయితీ
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటూ ఏకగ్రీవ ఆనవాయితీని పాటిస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఇక్కడ వార్డు సభ్యుల నుంచి సర్పంచి వరకు అందరినీ ఎంపిక ద్వారానే పీఠమెక్కిస్తామని వారు వెల్లడించారు. ఐదు వేల మంది ఓటర్లు ఉన్న ఈ పంచాయతీలో ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే వారికే మద్దతు తెలుపుతూ ఐక్యతను చాటుకుంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.