ఎంజీఎంలోనే చికిత్స అందించాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు తనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కుట్రపూరితంగానే తనను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స వద్దుని, తనకు ఎంజీఎం ఆస్పత్రిలోనే వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.