ఈ-కామర్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా, జెప్టో సంస్థలపై భారత ఆహార భద్రతా ప్రమాపాల ప్రాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడాఝుళిపించింది. నిబంధనలను ఉల్లంఘించడం, తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇవ్వడం అలాగే నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు స్పష్టం చేశారు.