హరిణి హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసులో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలూరుపాడులో విద్యార్థులు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను చట్టం ముందు నిలబెట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.