చిన్నారులకు భరోసా: ఆసుపత్రిని సందర్శించిన ఎన్ ఎఫ్ ఎల్ స్టార్
రిపోర్టర్: నరేష్
స్థలం: అయోవా
అమెరికన్ ఫుట్ బాల్ స్టార్ జార్జ్ కిటిల్ తన సతీమణి క్లైర్ తో కలిసి అయోవా చిన్నారుల ఆసుపత్రిని సందర్శించారు. ఈ విషయాన్ని ఎన్ ఎఫ్ ఎల్ స్టార్ జార్జ్ కిటిల్ వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించి వారికి ధైర్యం చెప్పారు. క్రీడాకారులుగా తాము సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.