ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి విజయవాడకు కారులో వెళుతుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సింగరాయకొండ పోలీసులు వెల్లడించారు.