సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం: దశాబ్దం తర్వాత అందిన ఆర్టీఐ సమాచారం

రిపోర్టర్: సురేష్ స్థలం: Kadapa

సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందని రీసెర్చ్ స్కాలర్ తుమ్మలూరు సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో పీహెచ్డీ పూర్తి చేసుకుని డాక్టరేట్ అందుకుని పదేళ్లు గడుస్తున్నా, నాటి దరఖాస్తులకు ఇప్పుడు వివిధ శాఖలు సమాధానాలు పంపుతుండటం గమ్యస్థానం చేరిన తర్వాత బస్సెక్కడం లాంటిదని ఆయన మండిపడ్డారు.