వైభవంగా సాగుతున్న కానుపాకం వినాయక స్వామి విమానోత్సవ వేడుకలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కానుపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు విమానోత్సవ సేవను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గణనాథుడు పురవీధులలో దివ్యమైన విమాన వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.