ఆత్మహత్యల నివారణ చిత్ర ప్రదర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూల స్పందన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ఆత్మహత్యల నివారణ ఉద్యమకారుడు గ్రూప్ కెప్టెన్ జి.జె.రావు గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రాణాలను కాపాడే లక్ష్యంతో రూపొందించిన సెప్టెంబర్-10 తెలుగు ఫీచర్ ఫిల్మ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందజేశారు. గ్రామాల్లో మరియు విద్యాసంస్థల్లో దీనిని ప్రదర్శించాలని, జాతీయ స్థాయిలో విస్తరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తగిన పరిశీలన జరిపి తన వద్దకు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జి.జె.రావు తెలిపారు.