అనుమసముద్రంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన పులిమి సుధాకర్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనుమసముద్రంపేట
ఏఎస్ పేట మండలంలోని అనుమసముద్రం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి పులిమి సుధాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బలపరిచిన అభ్యర్థులను సైకిల్ గుర్తుపై అత్యధిక ఓట్లతో గెలిపించి మండలంలో మరింత అభివృద్ధిని సాధించాలని ఓటర్లను కోరారు.