వైఎస్సార్సీపీకి భారీ షాకిస్తూ ఐదుగురు జడ్పీటీసీల సామూహిక రాజీనామా

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఐదుగురు జడ్పీటీసీ సభ్యులతో పాటు పలువురు కీలక నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి క్యాడర్ పార్టీ వీడుతుండటంతో అధిష్ఠానం తీవ్ర కలవరానికి గురైంది.