కూటమి ప్రభుత్వంలో భారీగా తగ్గిన విద్యుత్ కొనుగోలు వ్యయం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

వైకాపా హయాంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు వ్యయం భారీగా తగ్గింది. గతంలో యూనిట్ రూ.7.78 ఉండగా, ప్రస్తుత ప్రభుత్వ సంస్కరణలతో రూ.5.15కి పడిపోయింది. వినూత్న విధానాల ద్వారా విద్యుత్ కొనుగోళ్లలో యూనిట్‌పై రూ.2.63 ఆదా అవుతోంది. నెలకు సగటు ఖర్చు రూ.641.5 కోట్ల నుంచి రూ.194 కోట్లకు తగ్గింది.