విజయవాడలో విధుల్లో ఉండగా గుండెపోటుతో సీఐ అహ్మద్ అలీ మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద విధుల్లో ఉన్న నున్న సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయనను తోటి పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. సీఐ ఆకస్మిక మృతిపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందించే సమర్థవంతమైన అధికారిని కోల్పోవడం బాధాకరమని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు.