టెక్ మార్కెట్లోకి కార్బన్ రీఎంట్రీ: రెబెల్, రెబెల్ ప్రో ఫోన్ల విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
భారత టెక్ మార్కెట్లోకి ప్రముఖ దేశీయ బ్రాండ్ కార్బన్ సంస్థ సుదీర్ఘ విరామం తర్వాత ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. సోమవారం కార్బన్ రెబెల్ మరియు కార్బన్ రెబెల్ ప్రో పేరిట రెండు శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసినట్లు కంపెనీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్సెట్ తో పాటు అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయని, ఈ నెల నాల్గవ తేదీ నుంచి అమెజాన్ వేదికగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయని నిర్వహకులు తెలిపారు.