చిన్న గంగవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: దేవరాపల్లి

చిన్న గంగవరం గ్రామంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్థులు కలిసి గురువులకు ఘనంగా నివాళులర్పించారు.

పాంగి నాగేశ్వరరావు, కిలో బాబురావు, కవర్ల భగవాన్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. గురువుల సేవలను స్మరించుకుంటూ వారికి గౌరవం తెలపడం మన బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.