పాక్ ఏజెంట్లతో లింక్: ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలన అరెస్టులు
రిపోర్టర్: గోపి
స్థలం: విజయవాడ
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఫైర్వాల్ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఈ దేశద్రోహ కుట్రను ఛేదించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్, తమిళనాడులో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీలను అదుపులోకి తీసుకుని విజయవాడ జైలుకు తరలించారు.