భారత్‌లో జేఎస్‌డబ్ల్యూతో వోక్స్‌వ్యాగన్ వ్యూహాత్మక భాగస్వామ్యం

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్‌వ్యాగన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సిద్ధమవుతోంది. కార్ల శ్రేణిని పెంచడం, తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదురుతోంది. రెండు దశాబ్దాలుగా మార్కెట్లో కేవలం రెండు శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న వోక్స్‌వ్యాగన్, ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.