నెల్లూరు జిల్లాలో భారీ ఎర్రచందనం స్వాధీనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం ఆదురుపల్లి వద్ద పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు పరారయ్యారు. నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.