నాని 'ప్యారడైజ్' మూవీకి ట్రైలర్ ఉండదని స్పష్టం చేసిన హీరో!

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'ప్యారడైజ్'పై మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్ విడుదల చేయడం లేదని హీరో నాని క్లారిటీ ఇచ్చారు. సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఉందని, ట్రైలర్ కోసం సమయం కేటాయిస్తే అవుట్‌పుట్‌పై ప్రభావం పడుతుందని, సినిమానే మాకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సినిమాపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు.