చింతపల్లిలో ఎండిపోతున్న వరి పంట.. ఆందోళనలో రైతన్నలు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ వీరవరం గ్రామంలో వరి పంటలు ఎండిపోతున్నాయి. సరైన వర్షాలు లేక, సాగునీరు అందక వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురవకపోతే భారీ నష్టం తప్పదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునే మార్గం లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.