స్థానిక సంస్థల ఎన్నికలు: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎన్వోసీ, నో డ్యూస్ సర్టిఫికెట్ల నిబంధనను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎత్తివేసిందని ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఈ పత్రాలు లేవనే నెపంతో ఎవరి నామినేషన్నూ తిరస్కరించవద్దని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పంతొమ్మిది మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.