పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు: నిర్ణయం వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైకాపా నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయని, దీనిపై మంగళవారం ఉదయం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎం.కిరణ్మయి ప్రకటించారని పిటిషనర్లు తెలిపారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైకాపా తరఫు న్యాయవాది వాదించగా, అన్ని అంశాలను పరిశీలించే ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.