ప్రస్తుతానికి బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన లేదు: కేంద్రం
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి బ్రిక్స్ కూటమి తరఫున ఎలాంటి ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టే ప్రతిపాదన లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే సభ్య దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల భారాన్ని తగ్గించుకోవడానికి లోకల్ కరెన్సీలో చెల్లింపులు జరిపే అంశంపై చర్చలు కొనసాగుతాయని వెల్లడించింది.