తెలంగాణలో పేదల ఇళ్ల కోసం కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద రాష్ట్రానికి తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన 9.56 లక్షల కుటుంబాలకు కూడా ఇళ్లను కేటాయించాలని, వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.