మోదీ ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లరంటూ స్పష్టం చేసిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన కొనసాగుతుందని, ఆయన ఎక్కడికీ వెళ్లరని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజలతో సంబంధాలు లేని కొందరు ఈ సత్యాన్ని ఇంకా గుర్తించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల నాడిని అర్థం చేసుకోలేని వ్యక్తుల కోసమే ఈ నినాదాన్ని మరింత గట్టిగా చెబుతున్నామని పేర్కొంటూ కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు.