పాడేరు సెంటాయిన్స్ స్కూల్లో ఘనంగా గురువుల దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాడేరు

పాడేరులోని సెంటాయిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.

తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది గురువులేనని పాండు రాజు అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించింది.