హక్కుల సాధనకై ఏకం కావాలని పిలుపునిచ్చిన బీసీ నేత
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
సకల రంగాల్లో సముచిత వాటా కోసం బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద పద్మశాలి ఫంక్షన్ హాల్లో పిట్టల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీల సమస్యలపై నిరంతరం పోరాడాలని, అక్టోబర్ 15న జరిగే వరంగల్ జిల్లా మహాసభలను అందరూ విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.