పులివెందులలో కూటమి ప్రభంజనం: మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
రిపోర్టర్: సురేష్
స్థలం: Kadapa
ఏపీలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వైఎస్సార్సీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. గురజాల, పెదకూరపాడు, పుంగనూరు సహా పలు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించినట్లు రిటర్నింగ్ అధికారులు స్పష్టం చేశారు.