నెల్లూరులో ఘనంగా హజ్రత్ సయ్యద్ కంతర్ షా ఔలియా గంధ మహోత్సవం

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు రాంజీ నగర్ వైసిపి సిటీ ఆఫీస్ లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ముస్లిం మైనారిటీ నేతలు కలిసి హజ్రత్ సయ్యద్ కంతర్ షా ఔలియా దర్గా గంధాన్ని అందజేశారు. రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ సూచన మేరకు వైసీపీ నాయకులు జమీర్, ఖాదర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి దర్గా బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.