ఎమ్మెల్సీ ఎన్నికల్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ: ఓటరు నమోదులో వెనుకడుగు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్ లో ఓటరు నమోదు ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడినట్లు వార్తలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కేడర్ ఆశించిన స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అధిష్టానం అప్రమత్తమై చివరి గడువులోగా దరఖాస్తులను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.