ఆమదాలవలసలో ఘనంగా అంగన్వాడి ఉత్సవం: సేవలను ప్రశంసించిన ఎంఈఓ రాములు

రిపోర్టర్: Pydi. Suryanarayana స్థలం: ఆమదాలవలస

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి కెఏ రాములు అంగన్వాడి సిబ్బంది సేవలను అభినందించారు. ఈ సందర్భంగా పోషకాహార లోపం, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై ఆయన అవగాహన కల్పించారు.