ఫ్రాన్స్లో తీవ్ర ఉద్రిక్తత: రోడ్డెక్కిన ఐదు లక్షల మంది నిరసనకారులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Paris

ఫ్రాన్స్లో జీవన వ్యయం పెరుగుదల మరియు బడ్జెట్ కోతలకు వ్యతిరేకంగా సుమారు అయిదు లక్షల మందికి పైగా నిరసనకారులు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనలు చేపట్టారని పోలీసు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్తో పాటు వివిధ నగరాల్లో జరిగిన ఈ ఘర్షణల్లో ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయని, దుకాణాలు ధ్వంసమై లూటీ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.