జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా: కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి గాయాలు
రిపోర్టర్: గోపి
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులకు గాయాలయ్యాయిని పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.