లడ్డు వివాదంపై చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

శ్రీవారి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు ప్రచారంతో తెలుగు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వ్యక్తమైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో ఎలా చెప్తారని నిలదీశారు. లడ్డులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిందని, ఈ తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారని తీవ్రంగా మండిపడ్డారు.