అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జేడీ వాన్స్ పేరు పరిశీలన!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ వారసుడెవరు అనే చర్చ మొదలైంది. డాలస్‌లో జరిగిన సదస్సులో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రసంగించడంతో తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. వాన్స్‌తో పాటు మార్కో రుబియో, టెడ్ క్రూజ్, రాన్ డిసాంటిస్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ పాలనపై స్పష్టతనివ్వనున్నాయి.