వక్ఫ్ ఆస్తుల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: అక్బరుద్దీన్ ఒవైసీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతంపై అసెంబ్లీలో AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మైనారిటీ సంక్షేమం, హజ్ హౌస్ నిర్మాణాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మైనారిటీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంగీకరించారు.