చేపల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా నిలిపిన ద్విచక్రవాహనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బుచ్చిరెడ్డిపాలెం
మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని రాఘవరెడ్డి కాలనీలో ఉన్న చేపల మార్కెట్ సమీపంలో గత నెల రోజులుగా ఓ ద్విచక్ర వాహనం అనుమానాస్పద రీతిలో నిలిచి ఉంది. AP39AK9116 నమోదు సంఖ్య కలిగిన హీరో గ్లామర్ మోటార్ సైకిల్‌ను హ్యాండిల్ లాక్ కూడా వేయకుండా ఎవరో అక్కడే వదిలేసి వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే చేపల విక్రేతలు ఈ వాహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తగిన విచారణ చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.