సీఎంపీఎఫ్ నిధుల కుంభకోణంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి విశ్రాంత ఉద్యోగులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సీఎంపీఎఫ్ పెన్షన్ నిధుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను వెంటనే బర్తరఫ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ను పదిహేను వేలకు పెంచడంతో పాటు వైద్య పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచాలని కోరారు.