కావలిలో ఉచిత మెగా వైద్య శిబిరానికి పోటెత్తిన స్థానిక ప్రజలు

రిపోర్టర్: sujith reddy స్థలం: కావలి

నెల్లూరు జిల్లా కావలి రెండో వార్డు టిప్కో హౌస్ ప్రాంతంలో మంగళగిరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భారత్ హాస్పిటల్ వైద్య నిపుణులు, సుజన దంత వైద్యులు, త్రినేత్ర విజన్ ఆప్టికల్స్ సిబ్బంది పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య సమస్యలను వైద్యుల ముందు వెల్లడించారు.