అల్లూరి జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్: గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అల్లూరి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా అరకు వ్యాలీ పరిధిలోని తుడుము గ్రామంలో అలాగే కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొయ్యూరు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక ప్రజలకు మరియు విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించామని పేర్కొంటూ అల్లూరి పోలీస్ అధికారిక ఖాతా ద్వారా వివరాలు వెల్లడించారు.