పలాస ఎల్ఐసి కార్యాలయంలో విద్యార్థులకు పోటీలు, బహుమతుల ప్రదానం

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

పలాస ఎల్ఐసి కార్యాలయంలో 70వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విద్యార్థులు, ఏజెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఎల్ఐసి మేనేజర్ బి. రాజు బహుమతులు అందజేశారు.

ప్రతి రంగంలోనూ పోటీ తత్వం, ఒత్తిడిని అధిగమించినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలమని మేనేజర్ బి. రాజు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీఎన్ నంబూరి నరేష్, ఏడీఎం భాస్కరరావు, స్టాఫ్ సెక్రటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.