ముంబై పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కీలక నిర్ణయం: సాక్షిగా పరమ్ బీర్ సింగ్ తొలగింపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mumbai

ముంబైలో సంచలనం సృష్టించిన యాంటిలియా పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ను ప్రాసిక్యూషన్ సాక్షి జాబితా నుంచి ఎన్ఐఏ తొలగించింది. ప్రత్యేక విచారణ కోర్టులో దాఖలు చేసిన అన్ రిలైడ్ పత్రాల జాబితాలో ఆయన పేరును చేర్చినట్లు స్పష్టం చేశారు. సచిన్ వాజే ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్ర కేసు దర్యాప్తులో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.