ఈ నెల 17 నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ఈ నెల 17 నుంచి వాయవ్య రాజస్థాన్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 నాటికి ఇది పూర్తిగా ముగియనుంది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా 14 శాతానికి పైగా వర్షపాత లోటు నమోదైంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.