రోహిత్ శర్మ ఫిట్నెస్పై వస్తున్న విమర్శలను ఖండించిన మాజీ కోచ్ సోహం దేశాయ్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫిట్నెస్పై వస్తున్న విమర్శలు సరికాదని భారత జట్టు మాజీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ స్పష్టం చేశారు. 2017లో రోహిత్ తీవ్రమైన హిప్ గాయంతో ఇబ్బంది పడ్డారని, ఆయన సోమరితనం వల్లే ఫిట్నెస్ సమస్యలు వస్తున్నాయనడం అవాస్తవమని సోహం దేశాయ్ వెల్లడించారు. రోహిత్ శర్మ కెరీర్ ముప్పును ఎదుర్కొని, కష్టపడి ప్రాక్టీస్ చేస్తూనే ఇన్నాళ్లు రాణించారని ఆయన పేర్కొన్నారు.