భారీ వర్షాల బీభత్సం: మరోసారి తెగిన అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టు కట్ట

రిపోర్టర్: విజయ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

మురసు తుపాను ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ కట్ట తెగిపోయిందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద పోటెత్తడంతో గత మూడేళ్లలో కట్ట తెగిపోవడం ఇది రెండోసారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.