కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చిన వీర సూర్యచంద్ర
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రాజాన వీర సూర్యచంద్ర పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.