పెద్దకొండూరు గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ ప్రజలకు సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారీ యాదవ్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఐక్యతతో, ఆనందోత్సాహాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.